![]() |
![]() |

-మనల్ని మించిపోయారు
-జయా బచ్చన్ కీలక వ్యాఖ్యలు
-ఇప్పుడే పెళ్లి వద్దు
భారతీయ సిల్వర్ స్క్రీన్ పై బిగ్ బి 'అమితాబ్ బచ్చన్'(Amitabh Bachchan)కట్ అవుట్ కి ఒక చరిత్ర ఉంది. ఐదున్నర దశాబ్దాల నుంచి తన నట ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆ చరిత్ర తాలూకు ప్రొటెన్షియాలిటి ని అర్ధం చేసుకోవచ్చు. ఆ నట ప్రస్థానం మరింత కాలం కొనసాగాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుతున్నారు. గత ఏడాది కల్కి 2898 ఏడి, వేట్టయ్యన్ తో అలరించిన అమితాబ్ ప్రస్తుతం ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'రామాయణ' లో కీ రోల్ లో చేస్తునట్టుగా టాక్.
రీసెంట్ గా అమితాబ్ సతీమణి మాజీ హీరోయిన్, రాజ్యసభ సభ్యురాలు 'జయాబచ్చన్'(Jaya Bachchan)ముంబై వేదికగా మహిళలకి సంబంధించి జరిగిన 'వుయ్ ది విమెన్'(We The Women)అనే ప్రోగ్రాంకి గెస్ట్ గా హాజరయ్యారు. అందులో ఆమె తన మనవరాలు 'నవ్య నవేలి దందా'(Navya Naveli Nanda)వివాహం గురించి మాట్లాడుతు 'నవ్య కి మరికొన్ని రోజుల్లో 28 సంవత్సరాలు నిండుతాయి. ఇప్పుడే తను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తను తన జీవితాన్ని ఆస్వాదించాలి. అయినా నవ్య లాంటి నేటి తరం పిల్లలకి మనం సలహాలు ఇవ్వలేం. చిన్న పిల్లలు కూడా అన్నింటిలో మనల్ని మించిపోయారు. ఇక వివాహం అంటే ఇలానే ఉండాలనే నిర్వచనాలు లేవు. నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు. కష్ట సుఖాల్లో తోడుండాలంతే అని పేర్కొంది.
also read: పెద్ది ఓటిటి డీల్ ఇదేనా!..ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి
నవ్య నవేలి నంద సినిమాల్లోకి వస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయా బచ్చన్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమితాబ్, జయా బచ్చన్ ల ఒక్కనొక్క కూతురి కూతురే నవ్య.

![]() |
![]() |